అది డిల్లి నగరం, దేశ రాజధాని, అక్కడ పార్లమెంట్ ఉండును, అన్ని ప్రాంతాల వారికి సరిఐన ప్రాతినిధ్యం ఉండును. ఎపి భవన్ అని ఒక బంగ్లా, దానిని నిజాం కట్టించెను. కాని అక్కడ కేవలం ఆంధ్రా వాళ్ళు మాత్రమె ఉండును, ఈ విషయం ఇన్ని సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధులుగా ఫొస్ కొడుతున్న మన నాయకులకు ఎవ్వరికి కనపడలేదు, విన పడలేదు, మిగతా అన్ని విషయాల లాగానే వినపడదు, సోయి లేదు. హైదరాబాద్ లో ఎస్సి, బీసి లకి ఒకే ఒక అంబేద్కర్ భవన్ , తనక బ్యాండ్ నగరం నది బొడ్డున ఉండును. అందులో కూడా అందరూ ఆంధ్రా వారే ఉండును, చదువుకొనే వారు, బోదించే వారు. మనకు కనపడదు, అది వేరే విషయం, మల్లోక సంఘటన జరిగినపుడు చర్చించుదాం, అప్పటిదాకా పురసత్. ఏదైనా సంఘటన జరిగినపుడు మాత్రం లబో దిబో మని ఎడవాలే, అన్యాయం , అక్రమం అని అరవాలే. మనకి అలవాటే, వారికి అలవాటే, ఇపుడు మనకి అర్థం ఐన నీతి ఏందయ్యా అంటే, ఎక్కడ ఎపి ఉంటె అక్కడ ఆంధ్రా వారు మాత్రమె ఉండును. దాని ఫలితం, ప్రాంతం కోసం నిండు ప్రాణాలని త్రుణ ప్రాయంగా తీసుకున్న యాది రెడ్డి త్యాగం , ఒక అనాధ కంటే హీనంగా చూడబడింది, చిత్రించబడింది.
ఇంత కంటే అవమానం , అమానుషం ఇంకోటేదన్న ఉంటదా, అసలు మానవత్వం అనేది మచ్చుకైనా లేని, అమానవీయ జాతిని ఆంధ్రోల్లు అని అందురా? (సారి, అందులో మంచి వాళ్లకి మినహాయింపు). ఒక బిడ్డ, ఒక కారణం కోసం, న్యాయం కోసం, చేతకాని దద్దమ్మల ప్రజా ప్రతినిధుల తోని ఏది కావట్లేదని, కనీసం అమ్మ సోనియమ్మా కరునిస్తదని, కనీసం అక్కడ మీడియా అన్న ప్రచురిస్తదని, దయ, కరుణ కురిపిస్తదని, తెలంగాణాని ప్రకటిస్తదని మనస్పూర్తిగా నమ్మి ప్రాణాలు అర్పిస్తే, కనీసం ఆ వార్తని బయట ప్రపంచానికి తెలియ కుండా ఉంచడానికి కుట్రలు పన్ని, ఒక అనాధ శవాన్ని తగలేసినట్టు తగలేసి చేతులు దులుపు కుందామని అనుకున్నారు. వ్హాటే కంట్రీ! మా దేశం లోనే మేము కాన్దిశీకులం, పరాయి వాళ్ళం, ఈ దేశాన్ని చూస్తె కళ్ళు చెమరుస్తున్నాయి, రోమాలు నిక్క పోడుచుకుంటున్నాయి. ఈ దేశం కోసమేనా వేల ప్రాణాలు తీసుకున్నది? ఇదేనా స్వాతంత్రం, ప్రజా స్వామ్యం అంటే. అసలు ఇక్కడ హక్కులు, చట్టాలు న్యాయం అను విషయాలు ఉన్నాయా? ఉంటె ఎవరికీ ఉన్నాయి, బలిసిన వాడికి, రౌడిలకి, గూండాలకి..డబ్బు నోట్లకి మాత్రమేనా?
కేవలం తెలంగాణా ప్రాంతంలోనే ఆంధ్రా వాళ్ళ ఆక్రమణలు ఉండును, ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా వారి ఉద్యోగులను నిమ్పుకోనును..చేంజ్ ది డైలాగ్ నౌ, వారు ఎక్కడ ఉంటె అక్కడ పూర్తిగా వారే ఆక్రమించుకొని ఉందురు..అది డిల్లి గాని, అమెరికా కాని, (అందరూ దయచేసి మీ మీ ప్రాంతాలల్లో ఉన్న వారిని లేక్ఖిన్చుకోగలరు) అయినా, తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున లేచిన దగ్గరినుంచి వేరు పడ్డాము కాదా..నో ప్రాబ్లెం.
తెలంగాణా హక్కులు అడుక్కోవడానికి కాదు , శవాలను కాపాడుకొనే, శవ దహనాలు చేసుకొనే పోరాటం దాక కుదించబడింది. మా వాళ్ళు ఎక్కడ చని పోఇంరు, ఎవడు దిక్కు? మాకు బతికుండగా లేవు హక్కులు, కనీసం చచ్చినంక అన్న కనికరం లేదు. ఎం పాపం చేసినం, ఎం నేరం చేసినం రా భై! కడుపు మండుతుంది, ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది. అన్న హరిషన్నా, నీ జాగల ఎవ్వడున్న, వాడిని తన్నుడే! దూరంగా ఉన్న మాకే రక్తం మసలుతుంది. ఇదే ఆంధ్రా వాళ్లకి జరిగి ఉంటె, అక్కడ ఎన్ని దహనాలు జరుగుతున్డేనో, ఎన్ని విద్వంసాలు రచిస్తున్దేనో, క్షణాల మిద, మూకుమ్మడిగా ధర్నా కి దిగి, ఆంధ్రల ధర్నాలు మొదలైనాయి. ఇంకా చట్టాలు, కేసులు అంటారా , అవి ఎపుడు అవసరం ఉన్న వాడికి పనికి రాలేదు, అవకాశం ఉన్నవాడి స్వార్థానికి మాత్రమె, అయినా మనకి కనపడే వాడు ఎపుడు మనకు శత్రువే అనుకుంటాం, వాడి వెనుక ఉన్నస్వార్థ శక్తులని మనం ఎప్పుడు పట్టుకోలేము. ఇక్కడి పోలీసులనే కాదు , అక్కడి పోలీసులని, మీడియాని కూడా పట్టగలిగే సత్తా ఉంది, మనీ మేక్స్ మేని థింగ్స్!
ఇన్ని రోజులు నేషనల్ మీడియా రాయట్లేదు అని బాద పడితే ఇప్పుడు, బ్రేకిన్గ్ల తోటి వేస్తున్నారు, హరీష్ రావు బీట్స్ ఆఫీసర్, బ్రేక్స్, కేస్ పైల్డ్! ఆర్ని! అసలు, పేపర్లు, టీవీలు బందు పెడితే ఎట్లుంటది, కనీసం ఖర్చులు మిగులుతాయి, ఉద్యమాలకి అన్న పెట్టొచ్చు. పోలీసులు ఆంధ్రోల్ల కొరకే..మాకు మా బిడ్డలను గౌరవంగా తీసుకొనే హక్కు లేదు, నివాళులు అర్పించాలేము, అడ్డమోచ్చినోడిని అర్రెస్ట్ చేయండ్రి, బాధపడి, మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటే శవాలని కూడా చంపేయండి! ఇన్ని రోజుల మా మౌనానికి, మీ అక్రమానాలని చోద్యంగా చూసిన మా మౌనానికి, అంతా మావోల్లె అని నమ్మిన మా అమాయకత్వానికి అనుభవిస్తున్నాము. ఇంకా మంచి తనం, మానవత్వం లేకుండా మర మనుషులుగా తయారు అవుతామేమో అని కూడా భయపడుతున్నాము.
ఇంకా మాకు రాజకీయ పార్టీల మిద నమ్మకాలు పోయినై, ఒకరో ఇద్దరితోని ప్రభుత్వాలు నడవవు, వ్యక్తిగతంగా మాకు ప్రేమలున్నా అవి రాజకీయంగా గెలవడానికి పనికి రావు. ఇవాళ ఆజాద్ మొకం చూస్తె తెలంగాణా ఇస్తారన్న నమ్మకం కలుగుతలేదు.మల్లి చర్చలు, ఇక్కడ చావులు, అక్కడ చర్చలు. చేసుకోండి..మేము మాత్రం ఉద్యమాలని నమ్ముకున్నం, సీమంద్ర ప్రాంతం లో ఉద్యమం లేచింది అంటే కేంద్రాన్ని భయ పెట్టడానికే, కాని మనం బుజ్జగించడానికి ఉద్యమాలు చేస్తాం, బతిమిలాడుకుంటూ ఉంటాం. చేసుకొండ్రి. కార్నివాల్ తెలంగాణా!
ఈ బాదలు, అవమానాలు, అగ్గి గోళాలై మండిన నాడు,
ఒక్కొక్కడు ఒక్కొక్క నిప్పుకనికైన నాడు..
అమ్మల ఆక్రందనలు, శాపనార్థాలు నిలువెల్లా ఆవహించిన నాడు,
ప్రతిగుంట నక్క రాజకీయ నాయకులు రోడ్ల మిద పడక తప్పదు..
చరిత్రలోకి తొంగి చూద్దాం, విప్లవ పోరాటాల ఊపిరిలో
మునిగి తేలిన తెలంగాణాని స్మరించుకుందాం,
నువ్వు చూడని, కనీ విని ఎరుగని
నూతన ఉద్యమ రూపాలని చూపిస్తాం
తెలంగాణా స్వతంత్రాన్ని సాధించుకుంటాం అని
శ్రీకాంత్, యాదన్న, వెనుగోపాల్, యాది రెడ్డి..ఎందరొ..
ఆత్మలు ప్రస్నిన్స్తున్నై నినదిస్తున్నై, చూడండి, వినండి.
జై తెలంగాణా!
No comments:
Post a Comment